భారతదేశం, ఏప్రిల్ 2 -- Central Govt On HCU Lands Row : కంచ గచ్చిబౌలి భూములపై వివాదం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణంలోకి తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపింది. వాస్తవాధార నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్​, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు మంగళవారం దిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. హెచ్సీయూ భూముల విషయంలో జోక్యం చేసుకోవా...