భారతదేశం, ఏప్రిల్ 1 -- HCU Lands Issue : అబద్దాల మీదే కొన్ని రాజకీయ పార్టీలు బతుతున్నాయని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూమిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చుకోవడానికి, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో ప్రభుత్వం కేసు గెలిచింద...