తెలంగాణ,హైదరాబాద్, మే 8 -- Hyderabad University PG Admissions 2024: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 2024 -2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రవేశాలు ఉంటాయి. మొత్తం 41 కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

సీయూఈటీ (పీజీ)-2024 స్కోర్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. సీయూఈటీ పీజీ ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సీయూఈటీ పీజీ స్కోర్ మాత్రమే కాకుండా. ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్ల ప్రక్రియ ఉంటుంది. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 5వ తేదీన ప్రకటిస్తారు. జూన్ 12వ తేదీ నుంచి ఇంటర్వూలు ప్రారంభం అవుతాయి. జూన్ 14వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.

పీజీ ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ జాబితా వెల్లడి జూలై 01వ తేద...