Hyderabad, ఫిబ్రవరి 13 -- ప్రేమను దాదాపు అందరూ ముద్దు ద్వారానే వ్యక్తీకరిస్తారు. ఎదుటి మనిషిపై ప్రేమను ముద్దు పెట్టే గాఢతను బట్టి పసిగడతారు కూడా. అందుకే ప్రేమికుల మధ్య ముద్దుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతెందుకు చరిత్రలో చూసినా ఒక్క ముద్దు కోసం రాజ్యాలు రాసిచ్చిన రాజులున్నారు. ముద్దు ప్రాముఖ్యత అలాంటిది. దేనికైనా పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్లే, నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. అలానే ముద్దు కూడా ప్రాణం కంటే ఎక్కువ అనే ప్రేమను తెలియజేయడమే కాదు, ప్రాణాలను తీసే సమస్యను కూడా కలుగజేస్తుంది. అవును ఇది నిజమే. కొన్ని సందర్భాల్లో ముద్దు పెట్టుకోవడం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా కలిగిస్తుందట.

శ్వాసకోశ వైరస్‌లు, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులు సోకిన వ్యక్తి నుంచి జలుబు, ఫ్లూ వంటి వైరస్ వెంటనే వ్యాప్తి చ...