భారతదేశం, మార్చి 3 -- కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట.. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ.. మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ శుష్కమైన సెంటిమెంట్‌ను వల్లించడమే తప్ప.. పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని హరీష్ విమర్శించారు.

'నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్‌కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు.. ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం? బంగారం పండే నల్లరేగడి భూము...