భారతదేశం, మార్చి 5 -- Harish Rao On CBN : ఏపీ సీఎం చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన...చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఆనాడు ప్రాజెక్టులను అడ్డుకున్నారు, నేడు నీటిని అక్రమంగా తరలించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబైనా, జగన్ అయినా ఇద్దరిదీ ఒకే బాట అన్నారు.

8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో విఫలం అయ్యారన్నారు. కేంద్రంలో ఉన్న పలుకుబడి అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసే కుట్రలకు బీజేపీ వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు.

"తెలంగాణ నీట...