భారతదేశం, మార్చి 19 -- Harish Rao On Budget : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగంలాగా ఉందన్నారు. పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారన్నారు. బట్టి బడ్జెట్ - బడా జూట్ బడ్జెట్, ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. ఈరోజు బడ్జెట్ లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవన్నారు.

"ఎన్నికల ముందు అన్ని చేస్తాం ,అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నది. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బయట, అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నాడు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నం అన్నారు. 20 వేల కోట్లు ఇచ్చినం అంటున్నారు. గతేడాది వచ్చే ఏడాది లక్ష కోట్ల వడ...