భారతదేశం, జనవరి 27 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ షూటింగ్ ఐదేళ్ల కిందటే మొదలైనా.. పెండింగ్ పడుతూ వచ్చింది. చాలా ఆలస్యమైంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఏఎం జ్యోతికృష్ణ ఈ మూవీకి దర్శకుడిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన హరి హర వీరమల్లు మూవీని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ చెబుతోంది. డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక పవన్ నుంచి రానున్న తొలి మూవీ కావటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, హరి హర వీరమల్లు చిత్రం నుంచి నేడు (జనవరి 27) ఓ నయా పోస్టర్ వచ్చింది.

హర హరి వీరమల్లు చిత్రం నుంచి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నయా పోస్టర్ రిలీజ్ అయింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఈ పోస్టర్‌లో ...