Hyderabad, మార్చి 14 -- Hari Hara Veera Mallu New Release Date Announced: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా కోసం పవన్ అభిమానలు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది.

తాజాగా మరోసారి హరి హర వీరమల్లు వాయిదా పడింది. ఇంతకుముందు మార్చి 28న హరి హర వీరమల్లు రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా మేలో హరి హర వీరమల్లు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో మే 9న హరి హర వీరమల్లు మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అనౌన్స్‌ చేశారు.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గుర్రంపై సవారీ చేస్తున్న పవన్ కల్యాణ్ చాలా ఫ్యూరియస్‌గా కనిపించాడు. పవన్ కల్యాణ్ వెనుక గుర్రాలపై హీరోయిన్ నిధి అగర్వాల...