భారతదేశం, మార్చి 12 -- ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్య రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. కానీ ఈ సారి రికార్డు బ్రేక్ చేసింది గ్రౌండ్ లో కాదు సోషల్ మీడియాలో. ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ పోస్టు చేసిన ఓ ఫొటో లైక్స్ లతో దూసుకెళ్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత త్వరగా 1 మిలియన్ (10 లక్షలు) లైక్స్ సాధించిన ఫొటోగా రికార్డు నమోదైంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ట్రోఫీ ప్రెజెంటేషన్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు కప్ తో ఫొటోలు దిగారు. హార్దిక్ కూడా ట్రోఫీ తీసుకుని పిచ్ పైకి వెళ్లారు. పిచ్ పై ట్రోఫీ పెట్టి ఐకానిక్ స్టైల్లో ఫొటోకు ఫోజు ఇచ్చాడు. ఈ ఫొటోనే అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా లైక్స్ ల మీద లైక్స్ వస్తున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ లో హార్ద...