Hyderabad, మార్చి 30 -- ఉగాదికి శుభాకాంక్షలు చెప్పాకే పండగ మొదలవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే మొదటి పండుగ ఉగాది. దీన్నే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో గుడిపడ్వా అని అంటారు. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో ఉగాది అని అంటారు.

ఉగాది అనే పదం సంస్కృత పదం నుండి ఉద్భవించిందని చెప్పుకుంటారు. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు ఉగాది రోజే విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఉగాదిని నిర్వహించుకుంటామని అంటారు. ఈరోజు వ్యాపారాలు ప్రారంభించే వారి సంఖ్య ఎక్కువే. ఉగాది రోజు బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం ద్వారా పండుగను నిర్వహించుకోవడం మొదలుపెడతారు. మీరు కూడా చక్కటి శుభాకాంక్షలు కోసం వెతుకుతున్న వారైతే ఇక్కడ మేము ఉగాది విషెస్ ను, అందమైన సందేశాలుగా, కోట్స్ గా ఇచ్చాము. వాట్సాప్‌లో, సోషల్ మీడియాల...