Hyderabad, ఫిబ్రవరి 15 -- Happy Slap Day: వాలెంటైన్స్ డేకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, యాంటీ వాలెంటైన్స్ వీక్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్‌ను నిర్వహించుకుంటారు. ప్రేమలో ఉన్నవారు వాలెంటైన్స్ డే ను వైభవంగా జరుపుకుంటే, ప్రేమలో మోసపోయిన వారు యాంటీ వాలెంటైన్స్ వీక్‌ను నిర్వహించుకుంటారు. అలాగే ప్రేమ వివాహాలకు, ప్రేమకు వ్యతిరేకులు కూడా ఈ వాలెంటైన్స్ వీక్ ను నిర్వహించుకుంటారు. వాలెంటైన్స్ డే పూర్తయిన వెంటనే ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ మొదలైపోతుంది. వాలెంటైన్స్ డే లో కౌగిలింతలు, ముద్దులు, అందమైన వాగ్దానాలు ముఖ్యాంశాలుగా ఉంటే ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ లో మాత్రం చెంప మీద కొట్టడం, తప్పు ఒప్పుకునేలా చేయడం, బ్రేకప్ చేసుకోవడం వంటివి ఉంటాయి.

ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ ఉంటుం...