Hyderabad, ఫిబ్రవరి 9 -- సంతోషంగా ఉండటానికి ఒక ఫార్ములా లేదా వరం దొరికితే ఎంత బాగుంటుందో కదా! జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎప్పుడూ సంతోషంతోనే ఉంటాం. అయితే, అవన్నీ కలల్లోనే సాధ్యపడతాయని కొట్టిపారేయవద్దు. ఎటువంటి ఫార్ములా, వరాలు లేకున్నా సంతోషకరంగా జీవించేందుకు కొన్ని టిప్స్ పాటించండి. సంతోషకరమైన జీవితం గడుపుతున్న వారి నుండి మీరు కొన్ని విషయాలు నేర్చుకోండి.

ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉన్న వారిలో కొన్ని విషయాలు చాలా కామన్‌గా ఉంటాయట. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు ఇదే విషయాన్ని నిర్దారిస్తున్నాయి. సంతోషంగా ఉన్న వారిలో చాలా సాధారణంగా ఉండే అలవాట్లను మనం కూడా అలవరచుకుంటే, మరింత సంతోషంగా ఉండొచ్చట. అవేంటో తెలుసుకుందామా..

ప్రతిరోజూ కొంత సమయాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతున్న వారు చాలా సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉంటారట. అలా చ...