భారతదేశం, జనవరి 13 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగకి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటాము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం ఇలా వివిధ రకాల సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. అయితే భోగి (Bhogi 2026) నాడు మీ బంధువులు, స్నేహితులకు మనసారా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఈ కోట్స్ మెసేజ్‌లపై (Happy Bhogi Wishes and Quotes) ఒక లుక్ వేసేయండి.

నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి (Sankranti 2026) పండుగను జరుపుకుంటాము. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన నాడు మకర సంక్రాంతిని జరుపుకుంటాము. ఈ పండుగ తొలి రోజు భోగిగా జరుపుకుంటాము. బాధలు, కష్టాలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ భోగి మంటలను వేస్తారు. ఉత్తర...