భారతదేశం, ఏప్రిల్ 27 -- HanuMan Telugu Telecast: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ సూపర్ హీరో చిత్రం అంచనాలను మించి సుమారు రూ.330 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. థియేటర్లలో లాంగ్ రన్ సాధించి దుమ్మురేపింది. ఓటీటీల్లోనూ హనుమాన్ చిత్రం హవా చూపించింది. వారాల పాటు ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచి రికార్డుస్థాయి వ్యూస్ సాధించింది. ఇప్పుడు హనుమాన్ తెలుగులో టీవీలోకి వస్తోంది. దీంతో ఈ చిత్రం టీఆర్పీ విషయంలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.

హనుమాన్ సినిమా టెలికాస్ట్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో రేపు (ఏప్రిల్ 28) సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. హనుమాన్ టెలికాస్ట్...