భారతదేశం, ఏప్రిల్ 11 -- రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా.. పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. భారీ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రెచ్చగొట్టే నినాదాలు చేయొద్దని సూచించారు. దీనికి సంబంధించిన కీలకమైన 9 అంశాలు ఇలా ఉన్నాయి.

1.హనుమాన్ జయంతి సందర్బంగా శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

2.హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా.. సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.

3.శోభాయాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చేయరాదని స్పష్టం చేశారు.

4.మత సామరస...