భారతదేశం, ఫిబ్రవరి 2 -- Hanuman Creates History: హనుమాన్ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మూడు వారాల్లోనే సుమారు రూ.300 కోట్ల కలెక్షన్లకు చేరువైన హనుమాన్ సినిమా.. అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా నిలవడం విశేషం.

హనుమాన్ మూవీ ఈ అరుదైన రికార్డును క్రియేట్ చేసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సినిమాకు ఈ స్థాయి వసూళ్లు గతంలో ఎప్పుడూ రాలేదని వాళ్లు చెప్పారు. జనవరి 12న రిలీజైన హనుమాన్ మూవీ తొలి మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.270 కోట్ల వరకూ వసూలు చేసింది.

ఇప్పుడు రూ.300 కోట్ల లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో ఎన్నో ...