భారతదేశం, మార్చి 25 -- Hanumakonda Accident: హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కనకపూడి కరుణాకర్ కరీంనగర్ లోని ఓ చర్చిలో పాస్టర్ గా పని చేస్తున్నాడు. కాగా వ్యక్తిగత పని మీద సోమవారం హనుమకొండకు వచ్చిన ఆయన అర్ధరాత్రి ఒంటి గంట సుమారులో కరీంనగర్ కు బయలు దేరాడు.

హనుమకొండ నుంచి హుజురాబాద్ మీదుగా ఎన్ హెచ్ 563 విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో కరుణాకర్ హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు ఎల్కతుర్తి నుంచి టర్న్ తీసుకుని హుస్నాబాద్ వైపు వెళ్తుండగా.. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సమీపంలోని గోపాల్ పూర్ క్రాస్ వద్దకు అర్ధ రాత్రి 1.15 గంటల సుమారులో చేరుకున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట వైపు నుంచి హ...