Hyderabad, మార్చి 28 -- Hansika 105 Minutes OTT Streaming: హన్సిక మోత్వానీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మొత్తానికి ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ సినిమా రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.

హన్సిక నటించిన ఈ 105 మినిట్స్ మూవీ గురువారం (మార్చి 28) నుంచే ప్రైమ్ వీడియోలోకి రావడం విశేషం. సింగిల్ క్యారెక్టర్ తో ప్రయోగాత్మకంగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. కనీసం ఇంటర్వెల్ కూడా లేకుండా థియేటర్లలోకి ఈ సినిమా వచ్చింది. ఈ మూవీలో 34 నిమిషాల సీక్వెన్స్ తాను సింగిల్ టేక్ లో చేసినట్లు అప్పట్లో హన్సిక చెప్పింది.

అయితే ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్నేళ్లుగా టాలీవుడ్ క...