భారతదేశం, మార్చి 24 -- బాసరలో ఇప్పటికే ట్రిపుల్ ఐటీ ఉంది. దీనికి అనుబంధంగా తెలంగాణలో మరో రెండు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంట్లో ఒక దాన్ని హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిపుణుల కమిటీ సభ్యులు బాసర ఆర్‌జీయూకేటీ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్‌ మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య మంజూర్‌ హుస్సేన్‌ ఇటీవల రెవెన్యూ అధికారులతో కలిసి.. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలోని 60 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

కమిటీ సభ్యులు పరిశీలించిన ఆ స్థలం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కానీ.. భవిష్యత్తు అవసరాలకు మరో 40 ఎకరాలు అవసరమని కమిటీ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 4 కొత్త ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పి...