భారతదేశం, మార్చి 1 -- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరరావు(60)-లక్ష్మీ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కొడుకు సాగర్ కాగా.. చిన్న కొడుకు వికాస్(30). వీరిలో వికాస్ దివ్యాంగుడు.

ఇదిలా ఉండగా.. రాజేశ్వరరావు భార్య లక్ష్మీ కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న లక్ష్మీ శనివారం ఉదయమే హైదరాబాద్ నుంచి తన తల్లిగారి గ్రామం ఎల్కతుర్తి మండలంలోని వల్భాపూర్ వచ్చింది. దీంతో పింఛన్ తీసుకొని లక్ష్మీని చూసేందుకు భర్త రాజేశ్వరరావు తన చిన్న కొడుకు వికాస్‌ను సైకిల్ పై ఎక్కించుకుని వల్బాపూర్‌కు బయలు దేరాడు.

తండ్రీకొడుకులు రాజేశ్వరరావు, వికాస్ ఇద్దరూ సైకిల్ పై కోత...