భారతదేశం, జనవరి 27 -- Hanamkonda Accident : వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఖమ్మం హైవేపై జరిగిన లారీ ప్రమాదం మరువక ముందే హనుమకొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం, హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ఉన్న కూలీలకు గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్థానికుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు, మునిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 24 మంది మహిళలు కూలి పని కోసం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి వచ్చారు. ఉదయం 7 గంటల వరకే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

గ్రామానికి చెందిన ఓ టాటా ఏస్ వాహనం మాట్లాడుకుని వంగపల్లికి చేరుకున్నారు. కూల...