భారతదేశం, మార్చి 2 -- హలీం.. దీని పేరు వినగానే నోరూరుతుంది. ఇది రంజాన్ మాసంలో చాలా స్పెషల్. హైదరాబాద్‌లో ఇది ప్రాచుర్యం పొందింది. ఇరాన్, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల్లో దీనికి డిమాండ్ ఎక్కువ. నిజాం పరిపాలన కాలంలో ఇది హైదరాబాద్‌కు చేరిందని చెబుతారు. నిజామీ ఆస్థానంలో ఉన్నతాధికారి అయిన సుల్తాన్ సైఫ్ నవాజ్ జంగ్.. హైదరాబాద్‌లో హలీమ్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారని చరిత్ర చెబుతోంది. మొదట చార్మినార్‌కు సమీపంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సైనికులకు ఫిల్లింగ్ డిష్‌గా దీన్ని ఉపయోగించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఇది రంజాన్ వంటకంగా ప్రజాదరణ పొందింది.

మొదటగా గొధుమలు, బార్లీ, కాయధాన్యాలను రాత్రంతా నానబెట్టాలి. తరువాత మాంసాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి సుగంధ ద్రవ్యాలతో ఉడికించాలి. నానబెట్టిన గొధుమలు, బార్లీ, కాయధాన్యాలను మెత్తగా చేసి ఉడికించిన మాంసంలో కలపాలి. ఈ మి...