Hyderabad, మార్చి 29 -- Haleem: రంజాన్ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది హలీం. ముఖ్యంగా మటన్ హలీం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొనేందుకు కొన్ని షాపుల ముందు కిలోమీటర్ల మేర లైన్లు కూడా ఉంటాయి. కొంతమంది గంటల తరబడి వెయిట్ చేసి మరీ హలీమ్‌ని కొనుక్కొని తీసుకువెళ్తారు. హలీం వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీన్ని ఇంట్లో వండడం కన్నా కొనేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. నిజానికి ఇంట్లోనే హలీంను చాలా సులువుగా చేసుకోవచ్చు. తక్కువ మొత్తంలో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

మటన్ కీమా - అరకిలో

జీడిపప్పు - పావు కప్పు

నెయ్యి - పావు కప్పు

మినప్పప్పు - అరకప్పు

పెరుగు - ఒక కప్పు

కారం - అర స్పూను

పుదీనా ఆకులు - పావు కప్పు

గోధుమలు - ఒకటిన్నర కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పసుపు - పావు స్పూను

శనగపప్పు - అర...