HYderabad, మార్చి 30 -- పండుగలకు, ప్రత్యేక దినాలకు అలంకరించుకునే సమయంలో జుట్టుకు ఉండే ప్రాాధాన్యతే వేరు. తల వెంట్రుకలను అలంకరించుకునే పద్ధతిని బట్టి పూర్తి స్టైల్ మారిపోతుంది. మీ రూపాన్నే మరోలా కనిపించేలా చేస్తుంది. చాలా మంది అభిప్రాయం ప్రకారం.. హెయిర్ స్టైల్ అనేది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట. ఎందుకంటే, తమ ఇష్టాన్ని హెయిర్ స్టైల్ మీదే చూపిస్తుంటారు. కానీ, వేసవి కాలంలో అధిక వేడి కారణంగా జుట్టుపై దుష్ప్రభావం కనిపిస్తుంది. వేసవి వాతావరణానికి వేడి పెరిగి జుట్టు పొడిబారడం, చిక్కులుపడటం, తెగిపోవడానికి దారి తీస్తాయి.

వేసవిలో జుట్టు ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, పూర్తి ఆరోగ్యంగా కనిపించేందుకు ఈ సలహాలు పాటించాలని డెర్మటాలజిస్టు చెబుతున్నారు. అవేంటో చూసేద్దామా..?

బలహీనమైన జుట్టు ఉన్న వాళ్లకు వేడి అనేది ప్రధాన సమస్యగా ఉంటుం...