భారతదేశం, అక్టోబర్ 27 -- వేడుకలకు, పండగలకు రెడీ అవ్వడంలో ఉన్న ఆనందమే వేరు. అయితే పూర్తి లుక్ మంచి హెయిర్ స్టైల్ మార్చేయగలదు. జుట్టు ఎంత బాగుంటే అంత అందంగా కనిపించొచ్చు. అందుకే చాలా మంది ట్రెండీగా కనిపించాలని హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించాలి అనుకుంటారు. దానికోసమని బ్యూటీ పార్లర్ వెళ్లడం లేదా ఇంట్లోనే వేడి ఉండే స్ట్రెయిటెనర్ వాడటం చేస్తారు. వీటికోసం వాడే రసాయనాలున్న క్రీముల వల్ల జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. క్రమంగా నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే అవేమీ అక్కర్లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక హెయిర్ ప్యాక్ వేసుకున్నారంటే జుట్టు సహజంగానే కర్లీగా కాకుండా నిటారుగా మారుతుంది.

వేడి ఏమీ వాడకుండా జుట్టు నిటారుగా ఉండాలంటే హెయిర్ మాస్క్ అప్లై చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని బాగా ఉడకబెట్టి దాన్ని చల్లార్చి మిక్సీ పట్టి పేస్ట్ తయారు ...