Hyderabad, ఫిబ్రవరి 1 -- మనం అనుసరిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. దీనివల్ల, 30 నుండి 40 ఏళ్ళు దాటిన తర్వాత, అనేక వ్యాధుల బారిన పడుతున్నాము. మన జీవనశైలిలో మార్పు వచ్చేకొద్దీ, వచ్చే వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటి నుంచి తక్షణం ఉపశమనం పొందాలనే ఆలోచనతో వైద్యులను సంప్రదించి, మందులు వాడుతున్నాము. కానీ వాటిలో కొన్ని దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. వాటిల్లో తలకు సంబంధించి వాడే కెమికల్స్ విషయంలో కాస్త తేడా వచ్చిందంటే, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాస్తవానికి, ఈ సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించి, సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. అవి మరింత పెరగకుండా కూడా నిరోధించవచ్చు. అంతేకాకుండా నేటి కాలుష్యం కారణంగా జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా ఎక్కువమంది ఎదుర్కొంటున్నాం. దాన...