Hyderabad, మార్చి 28 -- ఉసిరికాయ, మందార. ఈ రెండూ కూడా జుట్టును ఒత్తుగా పెంచుతాయి. జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. కానీ చాలా మందికి ఈ రెండింటినీ జుట్టు కోసం ఎలా వాడాలో తెలియదు. ఉసిరి, మందార ఉపయోగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే నూనెను తయారు చేసుకోవచ్చు.

ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. నెత్తిపై రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తప్రసరణ చురుకుగా మారితే జుట్టు పెరుగుదల కూడా బావుంటుంది. ఈ నూనెను ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఉసిరి కాయ, మందార ఆకులు ఉపయోగించి నూనె ఎలా తయారుచేయవచ్చో ఇచ్చాము. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

రెండు స్పూన్ల ఉసిరికాయ పొడి, పది నుంచి పదిహేను మందార ఆకులు, రెండు మూడు మందార పువ్వులు తీసుకోవాలి. ఆ మందార ఆకులను ఎండలో కాకుండా నీడలోనే రెండు రోజులు ఎండబె...