Hyderabad, మార్చి 24 -- జుట్టు రాలడం అనేది ఈరోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న భయంకరమైన సమస్య. తల దువ్వుకున్న ప్రతిసారి వెంట్రుకలు కుప్పలు కుప్పలుగా రాలడం, చిన్నతనంలోనే బట్టతల రావడం ఇవన్నీ యూత్‌ని బాగా కలవరపెడుతున్నాయి. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు, షాంపూలను ఉపయోగిస్తున్నారు. పార్లర్‌కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఏం చేసినా, ఎన్ని రకాల ప్రొడక్టులు ఉపయోగించినా ఆశించిన ఫలితం కనిపించడం లేదని నిరాశ పడుతున్నారు.

మీరు అలాంటి వారిలో ఒకరైతే, జుట్టు రాలిపోవడం, పలుచగా తయారవడం వంటి సమస్యలు మీకూ ఉంటే, ఈ చిట్కాలను తప్పక ప్రయత్నించండి. వీటిని పాటించారంటే రూపాయి ఖర్చు లేకుండానే ఒత్తైన, పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అందమైన, ఆరోగ్యవంతమైన ఎదుగుదలను దక్కించుకోవచ్చు. ముఖ్యంగా బట్టతల సమస్య రాకుండా చేయచ్చు. ఆడవారికి, మగవార...