భారతదేశం, అక్టోబర్ 10 -- అమెరికాలో విదేశీయుల ఉద్యోగాల కోసం అత్యంత కీలకమైన హెచ్1బీ వీసాలకు అర్హత సాధించడం మరింత కష్టతరం కాబోతోంది! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం దీనికి సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనల్లో హెచ్1బీ వీసాను ఉద్యోగ యజమానులు ఎలా ఉపయోగించాలి? అలాగే ఎవరు ఈ వీసాకు అర్హులు? అనే దానిపై మరిన్ని ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు ఉంటాయని భావిస్తున్నారు.

ఇటీవలే హెచ్1బీ వీసా హోల్డర్ల కోసం 100,000 డాలర్ల ఫీజును శ్వేతసౌధం ప్రకటించడానికి కొద్దిగా ముందు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్​ఎస్​) తన రెగ్యులేటరీ ఎజెండాను విడుదల చేసింది. అందులో హెచ్1బీ కేటగిరీని మార్చేందుకు ఉద్దేశించిన ఒక నియమావళి ఉంది.

"రీఫార్మింగ్ ది హెచ్1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్" అనే ప...