భారతదేశం, సెప్టెంబర్ 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్​1బీ వీసాకు సంబంధించి చేసిన ప్రకటన భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేపింది! వచ్చే లాటరీ సైకిల్ నుంచి ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే, ఇప్పటికే వీసా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని వైట్ హౌస్ స్పష్టం చేయడంతో కొంత గందరగోళం తొలగింది. అయినప్పటికీ, ఇంకా అనేక సందేహాలు మిగిలే ఉన్నాయి.

F-1 OPT వీసాతో అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం దొరికితే హెచ్​1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. ట్రంప్ చేసిన ప్రకటనతో ఈ విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 21న కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్పడంతో ఏం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. అయి...