భారతదేశం, సెప్టెంబర్ 24 -- అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుకల్పించే హెచ్​1బీ వీసా ఫీజును అమాంతం పెంచేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఇప్పుడు అందుకు సంభించిన లాటరీ వ్యవస్థను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది.

అమెరికా అంతర్గత భద్రతా విభాగం నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదన.. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించాలని సూచిస్తోంది. దీనికి బదులుగా, 'వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్'ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం ద్వారా అత్యధిక నైపుణ్యం, అత్యధిక జీతాలు పొందుతున్న వారికి హెచ్​1బీ వీసాలు కేటాయించడంలో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే అన్ని వేతన స్థాయిల్లోని ఉద్యోగులకు వీసా పొందే అవకాశం ఉంటుందని కూడా ఈ ప్రతిపాదన స్పష్టం చేసింది.

హెచ్​1బీ వీసా ఎంపిక కోసం కొత్త ప్రతిపాదన ప్రకారం.. ...