భారతదేశం, ఏప్రిల్ 2 -- Alternatives to H-1B visa: అమెరికాలో ఉద్యోగానికి ప్రాధమిక, సంప్రదాయ ప్రవేశ ద్వారం హెచ్ -1బి వీసా. ఈ వీసా కోసం ప్రతీ ఏటా దరఖాస్తులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 2026 ఆర్థిక సంవత్సరానికి హెచ్ 1 బీ వీసా లాటరీ ఫలితాలు వెలువడ్డాయి. అయితే హెచ్1బీ లాటరీలో ఎంపిక కాకపోయినా.. ప్రత్యేక ప్రయోజనాలను అందించే, బహుశా యుఎస్ ఉద్యోగానికి వేగవంతమైన మార్గాలను అందించే హెచ్ 1 బీ ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నాయి. అవేంటంటే..

ఓ-1 వీసా వ్యాపారం, విద్య, క్రీడలు లేదా సైన్సెస్ లాంటి ఏదైనా రంగంలో మీరు అసాధారణ ప్రతిభావంతులైతే మీరు ఓ 1 వీసాకు అర్హులవుతారు. హెచ్ 1 బీ వీసాకు ఇది మంచి ప్రత్యామ్నాయం. ఓ-1 వీసా కోసం ఏ సమయంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇద హెచ్ 1 బీ మాదిరిగా లాటరీ ఆధారితమైనది కాదు.

తమ రంగంలో గొప్ప విజయాలు సాధించి, సైన్స్, ఎడ్యుకేషన్, బిజినె...