భారతదేశం, డిసెంబర్ 25 -- అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు, అక్కడ సేవలందిస్తున్న చిన్న తరహా కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా? అంటే అవుననే అంటోంది ఐటీ దిగ్గజ సంస్థల సమాఖ్య 'నాస్కామ్' (Nasscom). ఇప్పటివరకు అనుసరిస్తున్న హెచ్-1బి (H-1B) వీసా లాటరీ పద్ధతిని రద్దు చేసి, అధిక వేతనాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చేలా ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధనలపై నాస్కామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

"అకస్మాత్తుగా వేతన ఆధారిత విధానానికి మారడం వల్ల ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొంటుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కంపెనీలు తమ నియామక ప్రక్రియను విద్యాసంవత్సరం, క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాయి. కొత్త నిబంధనలతో వారి పనితీరు దెబ్బతింటుంది" అని నాస్కామ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధిక వేతనం ఇచ్చే నిపుణులకే వీసాలు దక...