భారతదేశం, డిసెంబర్ 23 -- అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులతో సహా ఇతర విదేశీ టెక్ నిపుణులకు ఆయా కంపెనీలు కీలక సూచనలు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం దాటి వెళ్లడం రిస్కుతో కూడుకున్న వ్యవహారమని, ఒకసారి విదేశాలకు వెళ్తే తిరిగి అమెరికాలోకి ప్రవేశించడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు హెచ్చరించాయి. సెలవుల సీజన్ ప్రారంభమైన తరుణంలో, తమ ఉద్యోగులు చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతో అంతర్గత మెమోలను జారీ చేశాయి.

"ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. లేదంటే మీరు అమెరికా బయటే సుదీర్ఘ కాలం ఉండిపోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది" అని గూగుల్ ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలను చూసే 'బెర్రీ యాపిల్‌మన్ & లైడెన్' సంస్థ స్పష్టం చేసింది.

అటు యాపిల్ సంస్థకు సలహాలు అందించే 'ఫ్రాగోమెన్' (Fragomen) సంస్థ కూడా ఇదే త...