తెలంగాణ,వరంగల్, మార్చి 20 -- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.650.12 కోట్లతో గ్రేటర్ బడ్జెట్ పెట్టగా.. ఈసారి అంచనాలు భారీగా పెంచేసి రూ.1071.41 కోట్లతో ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జీడబ్ల్యూఎంసీ పాలక వర్గం ఆమోదం తెలిపింది.

ఇందులో రూ.337 కోట్ల 38 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.728 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, రూ 600 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు. ఈ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

బల్దియా సొం...