భారతదేశం, మార్చి 3 -- జీడబ్ల్యూఎంసీ అధికారులు బడా బకాయిదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మొండిబకాయిదారుల ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల ఫర్నిచర్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకోగా.. పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు.

గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 2.25 లక్షల ఇళ్లు ఉండగా.. 11 లక్షల వరకు జనాభా ఉంది. గ్రేటర్ సిటీ పరిధిలో షాపులు, కాంప్లెంక్సులు, హాస్పిటల్స్, ఇతర అపార్ట్‌మెంట్స్ అన్నీ కలిపి 30 వేలకుపైగా అసెస్మెంట్స్ ఉన్నాయి. వరంగల్ ట్రై సిటీ పరిధి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 117.26 కోట్ల వరకు...