భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికీ జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవీ రెడ్డి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌లో ఇటీవల వివాదం జరిగింది. సంస్థ ఎండీ దినేష్‌ కుమార్‌ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ.. ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ వ్యాఖ్యలు ఐఏఎస్‌ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో సీఎంవో సూచన మేరకు.. ఇటీవల జీవీ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఫైబర్‌నెట్‌లో జరిగిన వ్యవహారాలపై వివరణ ఇచ్చారు.

అయితే.....