భారతదేశం, ఫిబ్రవరి 25 -- GV Reddy Issue: ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ప్రభుత్వం దానిని వెంటనే అమోదించడంతో పార్టీ శ్రేణులకు హెచ్చరిక అవుతుందని భావిస్తే అది కాస్త వికటించింది. టీడీపీ క్యాడర్‌లో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారంతా పార్టీ అధినేత తీరును తప్పు పడుతూ సోషల్‌ మీడియాలో ప్రశ్నించం మొదలు పెట్టారు.

ఐఏఎస్‌ అధికారుల ఒత్తిళ్లతో జీవీ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్ కుమార్‌తో పాటు గతంలో మరికొందరు అధికారుల విషయంలో కూడా టీడీపీ అధ్యక్షుడు పార్టీ నాయకులను కాకుండా అధికారులను సపోర్ట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు.

టీడీపీ నాయకులు ఆ పార్టీ వదలి పోతుంటే అధికారులను మాత్రం బదిలీతో సరిపెడుతున్నారని నిలదీస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్...