భారతదేశం, డిసెంబర్ 11 -- Guru Chandala Yogam: జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే అనేక యోగాలు ఉన్నాయి. అయితే చాలా మందికి ఈ యోగాల గురించి అవగాహన లేదు. నిజానికి కొన్ని శక్తివంతమైన యోగాలు గురించి మనం వింటూ ఉంటాం. గజకేసరి యోగం, గురుచండాల యోగం, కాలసర్ప యోగం ఇలాంటివి. వీటిలో గురు చండాల యోగం అంటే ఏంటి? ఈ యోగం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఎలాంటి పరిహారాలను పాటించాలి? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

జాతకంలో గురువు, రాహువు కలిసి ఉంటే దానిని గురు రాహు దోషమని అంటారు. మన జాతక చక్రంలో 1, 4, 7, 10 స్థానాల్లో గురువు, రాహువు కలిసి ఉన్నట్లయితే దానిని గురు చండాల యోగమని అంటారు. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక గ్రహ మహాదశ నడుస్తుంది లేదా అంతర్దశలు నడుస్తూ ఉండొచ్చు. ఈ పరిస్థితి జాతకంలో ఉంటే అది ఆ వ్యక్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది...