భారతదేశం, ఏప్రిల్ 22 -- Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స్టార్ మా ఛానెల్‌లో రీ టెలికాస్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రీ టెలికాస్ట్ టైమ్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇన్నాళ్లు మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల ముప్ఫై నిమిషాల‌కు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతూ వ‌చ్చింది. సోమ‌వారం నుంచి ఈ సీరియ‌ల్‌ను మ‌రో మూడు గంట‌లు ముందుకు షిఫ్ట్ చేశారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని స్టార్ మా అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ 2020 డిసెంబ‌ర్‌లో మొద‌లైంది. నాలుగేళ్ల పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సీరియ‌ల్‌కు గ‌త‌ ఏడాది ఆగ‌స్ట్‌లో మేక‌ర్స్ ఎండ్ కార్డ్ వేశారు. తెలుగులో టాప్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా గుప్పెడంత మ‌న‌సు నిలిచింది. టీఆర్‌పీలో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది.

2021 డిస...