భారతదేశం, మార్చి 4 -- Guppedantha Manasu Serial Episode 1015: గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధార కారు ఆగిపోవడంతో మను ఏమైందని అడుగుతాడు. కారు ప్లాబ్లమ్ వచ్చిందని వసుధార అంటుంది. నేను చూస్తాను. మీరు కారు స్టార్ట్ చేయండి అని మను అంటాడు. కారు చూసిన మను ఇలా కుదరదు మెకానిక్‌ను రమ్మనాలి అని మను అంటాడు. సరే నేను ఆన్‌లైన్‌లో మెకానిక్‌ను పిలిచి రిపేర్ చేసుకుని వెళ్తాను అని వసుధార అంటుంది. దానికి మీరు ఇక్కడ ఉండటం దేనికి. మెకానిక్‌నే ఇంటికి తీసుకురమ్మనండి. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని మను అంటాడు.

వసుధార వద్దంటే.. పర్లేదండి నేను డ్రాప్ చేస్తాను అని మను అంటాడు. నేను ఇంటికి వెళ్లట్లేదు అండి. వేరే చోటుకు వెళ్తున్నాను. అక్కడికి మీరు రాలేరు అని వసుధార అంటుంది. అయ్యో వస్తానండి. నేను రాను అంటుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మీరు ఇప్పుడు నరకానికి...