భారతదేశం, జనవరి 30 -- Guppedantha Manasu Mahendra: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ సాయికిర‌ణ్ స్టార్‌మాలో మ‌రో కొత్త టీవీ సీరియ‌ల్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సీరియ‌ల్‌లో విల‌న్‌గా సాయికిర‌ణ్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. భానుమ‌తి పేరుతో స్టార్ మా ఛానెల్‌లో ఓ కొత్త సీరియ‌ల్ త్వ‌ర‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

త‌మిళ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ చిన్న మ‌రుమ‌గ‌ల్ కు రీమేక్‌గా భానుమ‌తి తెర‌కెక్కుతోంది. ఈ తెలుగు సీరియ‌ల్‌లో శంక‌ర్‌కుమార్ చ‌క్ర‌వ‌ర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్నారు.

భానుమ‌తి సీరియ‌ల్‌లో సాయికిర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. లేటెస్ట్ ప్రోమోలో సాయికిర‌ణ్‌ను మేక‌ర్స్ చూపించారు. బ‌ల‌రాం అనే క్యారెక్ట‌ర్‌లో అత‌డి న‌టిస్తోన్న‌ట్లు చూపించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సీరియ‌ల్‌లో నెగెటివ్ షేడ్స్‌తో సాయికిర‌...