భారతదేశం, జనవరి 30 -- Guppedantha Manasu January 30th Episode: కాలేజీ ఫెస్ట్‌కు రావాల్సిన రిషి క‌నిపించ‌కుండా పోవ‌డంతో వ‌సుధార ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. శైలేంద్రనే ఈ ప‌ని చేసి ఉంటాడ‌ని అనుకొని అత‌డి చెంపలు వాయిస్తుంది. ఫ‌ణీంద్ర ఆమెను ఆపుతాడు. శైలేంద్ర‌పై విరుచుకుప‌డితే రిషి తిరిగివ‌స్తాడా? అని వ‌సుధారను ప్ర‌శ్నిస్తాడు.

శైలేంద్ర దుర్మార్గుడ‌ని, ప‌ర‌మ‌నీచుడు అని, వీడే రిషిని ఏదో చేశాడ‌ని వ‌సుధార ఆవేశంగా అన్ని నిజాల‌ను బ‌య‌ట‌పెట్టేస్తుంది. ఇలాంటి రాక్ష‌సుడు మీ క‌డుపున పుట్టినందుకు మీరు బాధ‌ప‌డ‌తార‌ని ఇన్నాళ్లు తాను, మ‌హేంద్ర శైలేంద్ర చేసిన కుట్ర‌ల‌ను దాచిపెట్టామ‌ని ఫ‌ణీంద్ర‌తో అంటుంది వ‌సుధార‌.

జ‌గ‌తిని భ‌య‌పెట్టి రిషి ఇళ్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోయేలా చేసింది శైలేంద్ర‌నే...చివ‌ర‌కు ఎండీ సీట్‌కు అడ్డుగా ఉంద‌ని జ‌గ‌తిని చంపింది కూడా ఈ దుర...