భారతదేశం, మార్చి 13 -- గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతిరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన క‌న్న‌డ మూవీ వ‌ర్ణ ప‌టల క‌ర్ణాట‌క స్టేట్‌ బెస్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. 2020 ఏడాదికిగాను క‌ర్ణాట‌క స్టేట్ ఫిల్మ్ అవార్డుల‌ను బుధ‌వారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో బెస్ట్ సెకండ్ ఫిల్మ్‌గా వ‌ర్ణ‌ప‌ట‌ల సినిమా పుర‌స్కారం గెల‌చుకుంది.

మెడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో జ్యోతిరాయ్ హీరోయిన్‌గా న‌టించింది. సుహాసిని మ‌ణిర‌త్నం, అనూప్ సాగ‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2020లో థియేట‌ర్ల‌లో రిలీజైన వ‌ర్ణ‌ప‌టల మంచి సినిమాగా క్రిటిక్స్‌తో పాటు ఆడియెన్స్‌ను మెప్పించింది.

వ‌ర్ణ‌ప‌ట‌ల మూవీకి బెస్ట్ మూవీగా అవార్డు రావ‌డం ప‌ట్ల జ్యోతిరాయ్ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. తాను మెయిన్ లీడ్‌లో న‌టించిన మూవీకి అవార్డు రావ‌డం గ‌ర్వంగా, గౌర‌వంగా ఉంద‌ని ...