Hyderabad, ఏప్రిల్ 29 -- Guppedantha Manasu Serial Episode 1062: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజీవ్‌ను గన్‌తో బెదిరించి వెళ్లబోయిన మను ఆగి.. ఒక్కటి గుర్తు పెట్టుకో.. వసుధార గారు అంటే రిషి భార్య అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఇది సార్ జరిగింది అని మను పోలీస్‌కు చెబుతాడు. సార్ ఈ స్టోరీలు మాకొద్దు. కోర్టుకు చెప్పండి అని పోలీస్ అంటాడు. మరి అక్కడ రాజీవ్ బాడీ లేదు కదా సార్ అని వసుధార అంటుంది.

చంపినవాడు బాడీని ఎందుకు ఉంచుతాడు. అది ఎక్కడైనా పడేయవచ్చు. ఆ బాడీని రికవరీ చేసే పని మాది. అప్పుడు మీకు పూర్తి ఆధారాలు దొరుకుతాయి. బాడీలో బుల్లెట్స్ ఉంటాయి కదా. మనుషుల మీద నమ్మకం పెట్టుకోవచ్చు. కానీ, ఇంత మూర్ఖంగా నమ్మొద్దు. మీరు ఇంకా ఎక్కువ సేపు ఉండకూడదు. మీరు నాతో ఆర్గ్యూ చేయకండి. లీగల్‌గానే ముందుకు వెళ్దాం అని చెప్పేసి వెళ్లిపోతాడు పోలీస్. దాంతో అ...