భారతదేశం, మార్చి 24 -- గుంటూరు జిల్లా రాజకీయం మళ్లీ వేడెక్కింది. విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో.. ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఫోన్ కాల్ డేటా తీయించారని ఆరోపించారు. 2021 సెప్టెంబర్‌లో తన సిబ్బంది, వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను ఓ సీఐ, డీఎస్పీతో ట్రాక్ చేయించారని వివరించారు. ఈ ఆరోపణలపై లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు.

'నేను కాల్‌ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్‌ సంస్థలు నడుపుతున్నాం. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలంవేస్తే.. పాల్గొని అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది. చాలా మంది దగ్గర విడదల రజిని డ...