భారతదేశం, మార్చి 30 -- Guntur Inhuman Incident : గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు ఫిరంగిపురంలో మొదటి భార్య సంతానమైన ఇద్దరి చిన్నారుల పట్ల రెండో భార్య అతి కిరాతకంగా వ్యవహరించింది. ఆరేళ్ల చిన్న కుమారుడిని చిత్ర హింసలు పెట్టి హత్య చేసింది. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్‌కు గతంలో వివాహం అయ్యింది. ఆయనకు మొదటి భార్యతో కవల పిల్లలు పుట్టారు. రెండేళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో...సాగర్ ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే 8 నెలల క్రితం లక్ష్మి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి భార్య ఇద్దరు కుమారులను లక్ష్మి నిత్యం చిత్రహింసలకు గురిచేసేది.

అతికిరాతంగా బెల్టు, కర్రతో కొట్టేది. తాజాగా చిన్న కుమారుడు కార్తిక్‌ తలపై కర్రతో బలంగా కొట్టింది. ఆ తర్వాత గొంతు నులిమి ఆరేళ్ల చిన్నార...