ఆంధ్రప్రదేశ్,గుంటూరు జిల్లా, ఫిబ్రవరి 19 -- గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. డబ్బులివ్వాల‌ని.. లేక‌పోతే మార్ఫింగ్ చేసిన న‌గ్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఇంజినీరింగ్ విద్యార్థినిని మరో ఇంజినీరింగ్ విద్యార్థి బెదిరించాడు. సదరు ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు అతనికి స‌హ‌క‌రిస్తున్న మ‌రో ముగ్గురిని పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు.

గుంటూరు అరండ‌ల్‌పేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఆ విద్యార్థినికి గ‌త కొంత కాలం క్రితం సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రో ఇంజినీరింగ్ విద్యార్థితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ కొంతకాలం బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆ త‌రువాత వీరిద్ద‌రూ మాట్లాడుకోవ‌టం లేదు. దీం...