భారతదేశం, ఫిబ్రవరి 10 -- Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న అభం శుభం తెలియ‌ని ఏడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి య‌త్నించాడు. అయితే బాలిక కుటుంబ స‌భ్యులకు ఈ విష‌యం తెలిసి నిందితుడికి దేహ‌శుద్ధి చేశారు. త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. అలాగే అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు జిల్లా కొల్లూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం కొల్లూరు మండలానికి చెందిన ఏడేళ్ల బాలిక స్థానికంగా చ‌దువుతోంది. జ‌న‌వ‌రి 29న బాలిక త‌ల్లిదండ్రులు కూలి ప‌నుల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఇంటి ముందు బాలిక ఆడుకుంటుంది. బాలిక ఇంటికి స‌మీపంలో నివాసం ఉంటున్న 49 ఏళ్ల ఉద‌ర‌గ‌డి ల‌క్ష్మయ్య బాలిక ఒంటిరిగా ఉండ‌టాన్ని గ‌...